Saturday, November 23, 2024

సాగునీటి పథకాలకు రూ.1000కోట్ల రుణం

- Advertisement -
- Advertisement -

Loan of Rs.1000 crore for irrigation schemes

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి పథకాల నిర్మాణాలకోసం రాష్ట్ర జల వనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ రూ.1000కోట్ల రుణం తీసుకునేందకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. గోదావరి నదీ పరివాహకంగా చేపట్టిన మూడు పథకాల పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు. శ్రీరాంసాగర్ వరద కాలువ, దేవాదుల తుపాకుల గూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఈ పథకాలకు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం తెలంగాణ జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అనుమతులు మంజూరు చేసింది.

ఈ నిధుల్లో వరద కాలువకు రూ.265కోట్లు, దేవాదుల తుపాకులగూడెం ప్రాజెక్టుకు రూ.265కోట్లు , సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.470కోట్లు కేటాయించనున్నారు. వరద కాలువ ,తుపాకులగూడెం పథకాలకు తీసుకునే రుణాన్ని 13ఏళ్లలో , సీతారామ ప్రాజెక్టు రుణాన్ని 14ఏళ్లలో కిస్తీల వారీగా చెల్లించాల్సివుంటుంది. ఈ ప్రాజెక్టులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాఖ్య నుంచి రూ.6,998.39కోట్లు రుణంగా మంజూరు కానుంది. ఈ మూడు ప్రాజెక్టులకు సబంధించి ఎంపిక చేసిన పనులను పూర్తి చేసేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News