Wednesday, January 22, 2025

కాళేశ్వరం డిపాజిట్ల వడ్డీలతో జల్సా ఖర్చులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కరో కరో జర జల్సా అన్నరీతిలో కాళేశ్వరం పేరుతో రుణాలు తెచ్చి వాటిని తిరిగి బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేసి తద్వరా వచ్చిన వడ్డీలను నీటిపారుద ల శాఖలోని కొందరు అధికారులు జల్సాల ఖర్చులుకు వాడేసుకున్నారు .ఇందులో నీటిపారుదలశాఖకు కీళక స్థాయిలో పనిచేసి రిటైర్డ్ అయిన ఒక అధికారి పేరు బయటకు పొక్కిం ది.ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలను అందించి వ్యవసాయరంగాన్ని సుసంపన్నం చేయాలన్న లక్షంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటిపధకం నిధుల వ్యయంలో ఆర్ధిక క్రమశిక్షణ దారి తప్పింది. కాళేశ్వరం పధరం పనుల కోసం అవసరమైన నిధులను సేకరించేందకు కాళేశ్వరం కార్పోరేషన్ పేరుతో ఒక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ అధికారులు దానికి నా బార్డు తదితర ఆర్ధిక సంస్థల నుంచి పెద్దమొత్తాల్లో రుణాలు సేకరించారు. ఆ సేకరించిన నిధులను తిరిగి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసి తద్వారా డిపాజిట్లపై వచ్చిన వడ్డీని ఖర్చుల పేరుతో జల్సాలు చేశారు. ఈ భాగోతం అంతా కాళేశ్వరం ప్రాజ్టెక్టు పై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ ఎదుట బట్టబయలైంది.

బుధవారం జరిగిన విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక స్థోమత, క్రమశిక్షణా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వరస్క్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని కమిషన్ ప్రశ్నించింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, సంబంధిత అంశాలపై ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల జీతాలు, చెల్లింపుల గురించి ఆరా తీశారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు చెప్పిన వెంకట అప్పారావు, వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్లు తెలిపారు.అయితే కార్పోరేషన్ ఉద్యోగులకు జీతాలు ఎలా వచ్చాయని ప్రశ్నింగా , అందరూ ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చి కాళేశ్వరం కార్పోరేషన్‌ల పనిచేస్తున్న వారే అని ,వారికి జీతాలు వారి మాతృశాఖలే చెల్లిస్తున్నట్టు కమీషన్ ముందు వెల్లడించారు. కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా, రుణాలు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది.

ప్రాజెక్టులో ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాత రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు రుణాలు తీసుకున్న తర్వాత ఏమైనా ఆస్తులు వచ్చాయా అని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని, ఆస్తులు రాలేదన్న అధికారులు, బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని తెలిపారు. కాగ్ నివేదిక గురించి అకౌంట్స్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు విషయంలో కాగ్ నివేదికతో అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందన్న అధికారులు, ఆర్థిక స్థోమత, క్రమశిక్షణా వైఫల్యం విషయంలో తాము స్పందించలేమని తెలిపారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలియదు. గుర్తు లేదు అన్న సమాధానాలతో దాటవేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News