Sunday, December 22, 2024

వేరుశనగ, పత్తి, మిర్చి రుణాలను అందజేయాలి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట ప్రతినిధి : బ్యాంకర్లు రుణాలు అందజేయడంలో జిల్లా ప్రజలకు, రైతులకు సహకరించా లని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఐడిఓసి సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంకర్లతో జడ్పీ చైర్మన్ , జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ విద్యలో వెనుకబాటుకు గురైన జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యకు సంబంధించిన రు ణాలు మంజూరు చేయాలన్నారు. రైతులకు అవసరమయ్యే వేరుశనగ, పత్తి, మిర్చి రుణాలను అందజేయాలని కోరారు. ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థులకు శానిటరీ పాడ్స్‌పై నాబార్డ్ వారు అవగాహన కల్పిస్తే జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని దాని ద్వారా ఇతర స్వయం ఉపాధి కింద సానిటరీ పాడ్స్ తయారు చేయడానికి ఉపాధి లభిస్తుందని అన్నారు. జిల్లా అద నపు కలెక్టర్ అపూర్వ చౌహన్ మాట్లాడుతూ పంట రుణాలలో 53 శాతం సాధించిందని, బ్యాంకుల వారీగా ప్రణాళికలు రూపొందించుకొని ఈ ఆర్ధిక సంవత్సరం మెరుగు పర్చాలన్నారు.

ఆర్‌ఐబి నుండి ఆర్ధిక అక్షరాస్యతపైన ప్రభుత్వ పాఠశాలలో చ దివే విద్యార్థులకు ఈ నెల 27న మండల స్థాయిలో క్విజ్ ఏ ర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పథకాల ద్వారా ఇన్సూరెన్స్ వర్తి ంప చేయాలన్నారు. పంట రుణాలు 53 శాతమే సాధించారని 100 శాతం వరకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు కృషి చేయాల న్నారు.

ప్రణాళిక బద్ధంగా రుణాలు చెల్లించేలా బ్యాంకర్లు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్‌బిఐ ఎల్డిఓ డిభోజిర్ బెరు హ మాట్లాడుతూ ఆర్‌బిఐ ఆదేశాల ప్రకారం ఆర్ధిక అక్షరాస్యత సాధించేలా జిల్లాలోని పాఠసాలలో ఈ నెల27న క్విజ్ ని ర్వహిస్తున్నట్లు తెలిపారు. నాబార్డ్ ఏజిఎం ష ణ్ముఖచారి, భీమే శ్వర్‌రావు, ఎల్‌డిఎం అయ్యప్పురెడ్డి, ఎస్‌బిఐ, యూనియన్ బ్యా ంక్, ఏపిజివిబి తదితర బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News