Thursday, January 23, 2025

పొదుపు సంఘాలకు వంద శాతం రుణాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రుణాలు నూరు శాతం అందించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ఫ్ సిఈఒ సందీప్‌కుమార్ సుల్తానియా కోరారు. గురువారం అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అదనపు డిఆర్‌డిఓలు, డిపిఎంలు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బందితో ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి బ్యాంకు లింకేజీ రుణాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన సమీక్షించారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి డేటాను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి నిర్దేశించిన ప్రత్యేక యాప్‌ను డిసెంబర్ చివరిలోగా సక్రమంగా వినియోగంలోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 60 శాతం మేరకు మాత్రమే బ్యాంక్ లింక్ రుణాలు సమకూర్చినందున మిగిలిన 40 శాతం నెల రోజులలోగా సాధించాలని ఆయన ఆదేశించారు.

ఆర్థిక లక్షం అని చూడకుండా అర్హులైన పొదుపు సంఘాలన్నింటికీ బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించాలని ఆయన ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బ్యాంక్ లింకేజీ రుణాలు నూరుశాతం అందించాలని కోరారు. రుణాలు పొందిన సంఘాలు తాము తీసుకున్న రుణాలు సద్వినియోగానికి గాను క్షేత్రస్థాయి తనిఖీ చేయాలని అధికారులను కోరారు. రుణాలు పొందిన సంఘాలు సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఎన్‌పిఎ లేకుండా చూడాలన్నారు. ఈ ఏడాది నిర్దేశించిన 18 వేల కోట్ల మేరకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు టెలి కా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News