Sunday, December 22, 2024

మహిళలకు లక్ష కోట్ల రుణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నాదని, ఈ ఐ దు సంవత్సరాల్లో ఎస్‌హెచ్‌జి మహిళలకు వ డ్డి లేకుండ లక్ష కోట్ల రూపాయలను పంపిణీ చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సచివాలయంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు సంబంధించి అంశంపైఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లుగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.ఈనెల 12 న హైదరాబాద్లో వడ్డీలేని రుణాల పథకాన్ని డ్వాక్రా మహిళ కొరకు తిరిగి ప్రారంభిస్తున్నామని వెల్లడించా రు. సమాజంలో సగ భాగం ఉన్న మహిళల ను ఆర్ధికంగా చేయుతను అందించి, ఆర్ధిక స్వాలంభన కల్పించడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు.

మహిళలను వ్యాపార వేత్తలుగా కా దు, పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీ పార్కులను సై తం త్వరలోనే తీసుకువస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ డిమాండ్ తగిన విధంగా ఏ ర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కం టే కాంగ్రెస్ ప్రభుత్వం  ఈ నాలుగు నెలల్లో ఎక్కువ విద్యుత్తును సరఫరా చేసిందని, రాష్ట్ర చరిత్రలో ఈ నెల 8న 15,623 మెగావాట్ల విద్యుత్తును అత్యధికంగా సరఫరా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కావాలా.? కరెంట్ కావాలా.? కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదని తప్పుడు ప్రచారం చేసిన బిఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడు మాసాల్లో ఎక్కువ విద్యుత్తును సరఫరా చేశామని గణంకాలతో సహా వెల్లడించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్‌లో 200 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేయగా,

కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేసిందన్నారు. అలాగే 2023 జనవరి నెలలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 జనవరిలో 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామన్నారు. 2023 ఫిబ్రవరి నెలలో 263.38 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 ఫిబ్రవరిలో 272.85 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామన్నారు. 2023 మార్చి నెలలో 289.78 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 మార్చిలో 295.21 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేసినట్టు చెప్పారు. రానున్న ఏప్రిల్, మే నెలలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరుగనుందని, దీనికి అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 16500 మెగాట్లు నమోదవుతుంది
రానున్న వేసవిలో గరిష్ట వినియోగం 16,500 మెగవాట్ల విద్యుత్తుకు చేరినప్పటికి తట్టుకొని నిలబడి పీక్ టైమ్‌లో సరఫరా చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశమని మంత్రి భట్టి తెలిపారు. ఒక నాయకుడు మాట్లాడే సమావేశంలో మైక్ కట్ అయితే కరెంటు పోయిందని ట్విట్ చేశాడని విమర్శించారు. విద్యుత్తు సరఫరా విషయంలో బిఆర్‌ఎస్ చేస్తున్న ఆసత్య ప్రచారంలో ఏలాంటి నిజం లేదని, ఈలాంటి అపోహలు నమ్మొద్దని, ప్రజలు నిశ్చింతగా ఉండాలని విజ్ఙప్తి చేశారు. నాణ్యమైన విద్యుత్తును అందించడానికి విద్యుత్తు లైన్ల వార్షిక నిర్వహణ, మరమత్తుల నిమిత్తం నిలిపివేసిన కరెంటును కోతలుగా చూడవద్దని, కేవలం తాత్కలిక అంతరాయంగా మాత్రమే చూడాలన్నారు.
గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను మోడల్ గా నిలుపుతాం
గ్రీన్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ను దేశంలో మోడల్ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన సహకారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ప్రత్యామ్నయ విద్యుత్తు ఉత్పత్తిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సోలార్, విండ్, హైడల్, పంప్డ్ స్టోరేజీ, సింగరేణి కాలరీస్‌లో నిరుపయోగంగా ఉన్న బొగ్గు బ్లాక్లు, ఒ.బిలలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్టు వివరించారు. అలాగే భారీ, మధ్య తరహా సాగు నీటి రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీని వల్ల మత్స్య సంపదకు ఏలాంటి నష్టం ఉండదని, మత్స్య కారులు ఏలాంటి ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇరిగేషన్ మెయిన్ కాలువలు, కాలువ పక్కన ఉన్న బండ్స్ మీద కూడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అధికారులను అధ్యయనం చేయాలని ఆదేశించామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల విద్యత్తు అవసరాలకు అనుగుణంగా సమృద్దిగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు.

గృహజ్యోతి పై తప్పుడు ప్రచారం వద్దు
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటి సిఎం విమర్శించారు.ఈ తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని హితవు పలికారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్తును అందిస్తామన్నారు. ప్రజాపాలన లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్ ను సరిగ్గా పొందు పరిచి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల జీరో బిల్లు వచ్చిందన్నారు. దరఖాస్తులో పొరపాటున తప్పులు పడిన వారికి జిరో బిల్లు రాకపోయి ఉండవచ్చన్నారు. వీరు వెంటనే ఎంపిడివో కార్యాలయం వెళ్లి అక్కడ ఉన్న ప్రజపాలన అధికారికి తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన తరువాత జీరో బిల్లు వస్తుందని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్తు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 మందికి గృహజ్యోతి పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏండ్లుగా రేషన్ కార్డు ఇవ్వని కారణంగానే కొత్తగా పెళ్లి అయిన వారికి గృహజ్యోతి రావడంలేదన్నారు. గృహజ్యోతి కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఏలాంటి అందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కొండలు, గుట్టలకు రైతు బీమా ఇచ్చారు..
గత ప్రభుత్వం కొండలు, గుట్టలు ఉన్న బడా బాబులకు 20 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పేరిట ఇచ్చినట్టు ఇటీవల పేపర్లో చదివాని తెలిపిన మంత్రి ఇది ప్రజల సొమ్ము. ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడాడలని,.దుర్వినియోగం కావడానికి వీలులేదు అన్నారు. మేం ప్రకటించిన గ్యారంటీల అమలుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండ పకడ్భందీగా చర్యలు చేపట్టామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం యాసంగి సీజన్లో 5 నెలల వరకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. కానీ మేము ప్రాధన్యత క్రమంలో వ్యవసాయం చేసే వారిని ప్రోత్సహించాలని రైతు భరోసా డబ్బులను మొదట ఎకరం లోపు, ఆ తరువాత రెండు, మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు జమ చేశాము. నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు జమ చేస్తున్నాము. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు త్వరలోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు.

కాంగ్రేస్‌ను విమర్శించే అర్హత బిఆర్‌ఎస్‌కు లేదు..
రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను అమలు చేయని బిర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలకు బడ్జెట్ లో నిధులు సైతం కేటాయించినట్టు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు 3 నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వ్యవసాయ బావుల మోటర్లకు ఎట్టి పరిస్థితిలో విద్యుత్తు మీటర్లు బిగించమని ముందే చెప్పామని. దానికి కట్టుబడి ఉన్నామని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పారు. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆర్ధిక వ్యవస్థను చిన్నభిన్నం చేసినప్పటికి నిబద్దత కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను గాడిలోకి తీసుకువచ్చి మార్చి 1 న ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు వేతనాలు అందించిందని, ఇది మా ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం ఆశ, అంగన్ వాడి, మధ్యాహ్న భోజనం అయాలకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదని, మేమే ప్రతినెల వారికి జీతాలు ఇవ్వాలని ప్రాధన్యతగా పెట్టుకొని చెల్లిస్తున్నట్టు వివరించారు. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండ దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిందన్నారు. మేము అధికారంలోకి రాగానే తొలుత రూ.10లక్షల రూపాయల లోపు ఉన్నబిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు.

టిటిఎల్ ఒప్పందంతో 9వేల మంది విద్యార్థులకు లబ్ధి
నూతనంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన శిక్షణను ఐటిఐ విద్య సంస్థల్లో యువతకు ఇవ్వడానికి టిటిఎల్‌తో ఎంవోయూ కుదుర్చుకోవడం శుభవార్త అని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన లేటేస్ట్ ఆడ్వాన్స్ టెక్నాలజీ కోర్సుల్లో నైపుణ్యం పొందడానికి ఐటిఐ సంస్థల్లో టిటిఎల్ ప్రాజెక్టు సహాకరాంతో శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం 9వేల మంది విద్యార్థులు లబ్ధిపొందుతారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News