హైదరాబాద్: లోకా లోక ఈరోజు అధికారికంగా అంతర్జాతీయ ఆల్కోబెవ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. తమ కార్యకలాపాల ప్రారంభ సూచికగా టేకిలా బ్లాంకో, రెపోసాడో ను విడుదల చేసింది. లోకా లోకకు ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు రానా దగ్గుబాటి, ప్రఖ్యాత సంగీతకారుడు, స్వరకర్త అనిరుధ్ రవిచందర్, అనుభవజ్ఞుడైన వ్యవస్థాపకుడు, ఐరన్‌హిల్ ఇండియా మేనేజింగ్ పార్టనర్ హర్ష వడ్లమూడి మద్దతునిస్తున్నారు.
గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా చేసుకున్న బ్రాండ్ మొదట యుఎస్ లో విడుదల చేయబడుతుంది, తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు. జాలిస్కో డిస్టిలరీ ప్రొడక్షన్ హెడ్ లియోన్ బాన్యులోస్ రామిరెజ్ మాట్లాడుతూ “మెక్సికన్ టేకిలా సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తుండటం సంతోషంగా వుంది. లోకా లోకతో, మేము సంస్కృతులను అన్వేషించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము. లోకా లోక నిజంగా ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన టేకిలా అనుభవాన్ని రూపొందిస్తోంది” అని అన్నారు.
లోకా లోక వెనుక ఇద్దరు భారతీయ చలనచిత్ర నటుడు రానా దగ్గుబాటి మరియు ప్రఖ్యాత సంగీతకారుడు, స్వరకర్త అనిరుధ్ రవిచందర్ తో పాటుగా అనుభవజ్ఞుడైన వ్యవస్థాపకుడు హర్ష వడ్లమూడి వున్నారు.
“భారతీయ, మెక్సికన్ సంస్కృతులు రెండూ గొప్ప చరిత్ర కలిగి ఉన్నాయి” అని రానా దగ్గుబాటి అన్నారు. “లోకా లోకతో, మేము ఈ సంస్కృతుల సారాంశాన్ని ఒకచోట చేర్చి, వాటిని దీర్ఘకాల టేకిలా ప్రేమికుల చెంతకు తీసుకురాబోతున్నాము” అని అన్నారు. “సృజనాత్మకతతో అల్లిన సంస్కృతి, హస్తకళ ఈ బ్రాండ్‌ను నిర్వచిస్తుంది” అని అనిరుధ్ జోడించారు.
“యు.ఎస్‌లో టేకిలా త్వరిత పార్టీ షాట్ నుండి చాలా మంది ఇష్టపడే అధునాతన స్పిరిట్ కు రూపాంతరం చెందడాన్ని మేము చూసినప్పుడు, ఒక ప్రత్యేకమైన అవకాశం ఉందని స్పష్టమైంది” అని లోకా లోక వ్యవస్థాపకుడు హర్ష వడ్లమూడి వివరించారు. అంతర్జాతీయంగా అభిమానులకు మెక్సికన్ పానీయాన్ని పరిచయం చేయడానికి ముగ్గురు భారతీయులు కలిసిన మొదటి సందర్భం ఇదన్నారు.