Tuesday, January 21, 2025

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు, ముఖ్య నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. కలెక్టరేట్‌లో సాగునీటి ప్రా జెక్టులు, విద్య, వైద్యంపై మంగళవారం సమీక్ష అనంతరం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎన్నికలపై సిఎం క్లారిటీ ఇచ్చారు.

త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, కష్టపడిన వారికే న్యాయం దక్కుతుందని అన్నారు. ‘మీరు నాయకుల కోసం కష్టపడి గెలిపించారు… స్థానిక ఎన్నికల్లో మీ కోసం నాయకులు కష్టపడి గెలిపించుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నాయకులకు ఆదేశించినట్లు వెల్లడించారు. కార్యకర్తలను కలిస్తే తనకు వెయ్యి ఏనుగుల బలం వస్తుందని.. మీకు ఎప్పుడు పార్టీతో పాటు తాను కూడా అండగా ఉంటానని స్పష్టం చేశారు.

ఈ ప్రభుత్వం మీది..మీ సూచనలు, సలహాలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. తానూ కార్యకర్తల్లో ఒకరినని. అందుకే ముఖ్య నాయకులను కలవాడినికే వచ్చానని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించానని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News