Friday, December 20, 2024

లోకల్ చైన్‌స్నాచర్లు.. వృద్ధులు, ఒంటరి మహిళలే టార్గెట్

- Advertisement -
- Advertisement -

వృద్ధులు, ఒంటరి మహిళలే టార్గెట్
వరుసగా మూడు కమిషనరేట్లలో స్నాచింగ్‌లు

హైదరాబాద్: ఒంటరి మహిళలు, వృద్ధులకు టార్గెట్‌గా చేసుకుని చైన్‌స్నాచర్లు దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన చైన్‌స్నాచింగ్ కేసుల్లో నిస్సాహయంగా ఉంటున్న వారిని దోచుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో చాలామంది బాధితులు వృద్ధులు, ఒంటరిగా ఉంటున్నవారే ఉంటున్నారు. వీరిని దోచుకుంటున్న వారిలో ఎక్కువగా వ్యసనాలకు బానిసలుగా మారినవారే ఎక్కువగా ఉంటున్నారు. వ్యసనాలకు బానిసలుగా మారిన నిందితులు చేతిలో డబ్బులు లేకపోవడంతో మహిళల మెడలోని బంగారు చైన్లను చోరీ చేస్తున్నారు. వాటిని విక్రయించిన డబ్బులతో జల్సాలు చేయాలని ప్లాన్ వేసిన నిందితులు చోరీలు చేస్తున్నారు.

కానీ చాలా కేసుల్లో నిందితులకు పట్టుబడుతున్నారు, మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసులో నిందితులు ముందుజాగ్రత్తగా నంబర్ ప్లేట్‌లేని బైక్‌ను వాడారు. అయినా కూడా ఇద్దరు నిందితులు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఇద్దరు మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో మహిళను పని ఉందని చెప్పి పిలిచి ఆమె మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులు పట్టుబడ్డారు, వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో వ్యసనాలకు బానిసగా మారిన యువకుడు స్థానికంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు.

మద్యం, సిగరేట్లు, గుట్కాకు బానిసగా మారాడు. స్నేహితులతో కలిసి బలాదూర్‌గా తిరుగుతున్నాడు, దీంతో ఏ ఉద్యోగం సరిగ్గా చేయకుండా మానివేసేవాడు. దీంతో వ్యసనాలకు డబ్బులు లేకపోవడంతో చోరీల బాటపట్టాడు. పాన్‌షాపు నిర్వహిస్తున్న ఒంటరి వృద్ధురాలిపై బంగారు ఆభరణాలపై కన్నుపడింది. స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు ఆమె వద్ద సిగరేట్ల కొనుగోలు చేసేవారు. ఆ సమయంలో వృద్ధురాలి మెడలోని బంగారు చైన్‌ను చూసి దానిని చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి బంగారు చైన్‌ను చోరీ చేశాడు.ఇలా స్థానికంగా ఉంటున్న చైన్‌స్నాచింగ్ చేస్తున్న వారు వారి అవసరాలకు డబ్బులు లేకపోవడంతో బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్నారు.

వ్యసనాలే మార్చుతున్నాయి….
ఇటీవల కాలంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగి వరుస చైన్‌స్నాచింగ్‌ల కేసులలో వ్యసనాలకు బానిసలుగా మారిన నిందితులు చోరీలు చేశారు. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా వ్యసనాలకు డబ్బులు లేకపోవడంతో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. సాధారణంగా చైన్‌స్నాచింగ్ అంటే అంతరాష్ట్రముఠాలు గుర్తుకు వస్తాయి, ముఖ్యంగా ఉత్తరాది ముఠాలు నగరానికి వచ్చి వరుసగా చైన్‌స్నాచింగ్‌లు చేసి ఇక్కడి నుంచి పారిపోయేవారు. కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న చైన్‌స్నాచింగ్‌లు కేవలం వ్యసనాలకు బానిసలుగామారిన యువకులే చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News