Saturday, March 15, 2025

స్థానిక సమరం మరింత ఆలస్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మరోసారి కులగణన జరగనున్న కారణంగా స్థానిక సంస్థల ఎ న్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. కులగణన సర్వే మళ్లీ చేయాలన్న ప్ర భుత్వ నిర్ణయంతో స్థానిక ఎన్నికలు ఆల స్యం కానున్నాయి. స్థానిక ఎన్నికల్లో బిసిల కు 42 శాతం రిజర్వేషన్లు ఇ స్తామని డిప్యూ టీ సిఎం భట్టి స్పష్టం చేశారు. బిసి రిజర్వేషన్ల పెంపునకు మార్చిలో కే బినెట్ ఆమో దం పొందిన అనంతరం అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది. మా ర్చి లో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సంద ర్భంగా బిసి బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం సి ద్ధమైంది. అయితే అసెంబ్లీలో బిల్లు ఆమో దం పొందినంత మాత్రాన రిజర్వేషన్లకు చ ట్టభద్దత లభించదు.

అందుకు పార్ల మెంట్‌లో కూడా రాష్ట్ర శాసనసభ చేసిన చ ట్టం ఆమోదం పొందవలసి ఉంటుంది. అ యితే ఇప్పటికే కేంద్ర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. తిరిగి వర్షాకాల సమావేశాల సందర్భంగానే పార్లమెంట్ సమావేశం కానున్నది. ఆ సమావేశాలు ఆరు నెలల వ్యవధి తర్వాత జులై, సెప్టెంబర్ మధ్యన జరుగనున్నాయి. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిసి రిజర్వేషన్ల పెంపు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే.

బిసి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కోసం ఆగాల్సిందే
బిసి రిజర్వేషన్ల పెంపు అంశం ఇలాంటి అనేక సాంకేతిక సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావలసిన నిధులు ఆగిపోతాయని తెలిసినప్పటికీ రిజర్వేషన్ల ఆమోదానికి సాంకేతిక కారణాలు ముడిపడి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు కూడా సిద్ధపడినట్లు కనిపిస్తోంది. విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకురాగా, ఆయన కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు.

ప్రజలకు కొంతకాలం పాటు ఆర్థిక నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాది పూర్తయినప్పటికీ కనీసం మరో ఆరు నెలలైనా ఆగకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఇసి సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News