తుర్కయంజాల్: అధికారులను అడ్డంపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీకి అభివృద్దికి అడ్డుపడుతున్నాడని తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఆరోపించారు. శుక్రవారం రాగన్నగూడ వార్డు కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛైర్‌పర్సన్ అనురాధ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌లు మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్దికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్డంకిగా మారారని, అధికారులను అడ్డంపెట్టుకొని అభివృద్దిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండ అహ్వన పత్రికలలో తమ పెర్లను చేర్చకపోవడం విడ్డురంగా ఉందదని విమర్శించారు. దీనిపై జిల్లా కలేక్టర్ పిర్యాదు చేస్తామన్నారు. మున్సిపాలిటీ ప్రజలు చేల్లించే టాక్స్‌ల వల్లే అభివృద్ది పనులు చేపడుతున్నట్లు, ఎమ్మెల్యే తన నిధుల నుండి నయాపైస ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతిలో ఫ్రోటోకాల్ పాటించక పోవడం వల్లే తాము బహిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కొషిక ఐలయ్య, కౌన్సిలర్‌లు కుంట ఉదయశ్రీ, మర్రి మాధవి, నక్క శివలింగంగౌడ్, సునీల్, కంబాల పల్లి ధన్‌రాజ్, బండారి బాలప్ప, నాయకులు గుండ్లపల్లి ధన్‌రాజ్‌గౌడ్, మర్రి మహెందర్‌రెడ్డి, కుంట గోపాల్‌రెడ్డి, వంగేటి గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి అడ్డుపడుతున్న స్థానిక ఎంఎల్‌ఎ
- Advertisement -
- Advertisement -
- Advertisement -