Friday, November 15, 2024

ఎన్నికల పిదప చిన్న ప్రతిపక్షాలు కాంగ్రెస్‌లో విలీనం

- Advertisement -
- Advertisement -

ఆ పార్టీ వైపు వెళితే ప్రమాదం
వోటర్లకు ప్రధాని మోడీ హెచ్చరిక
ఉద్ధవ్ వర్గాన్ని ఉదాహరణగా పేర్కొన్న మోడీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ వైపు వెళితే ముప్పు తప్పదని వోటర్లను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం హెచ్చరించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్కరే నాయకత్వంలోని శివసేన వర్గాన్ని మోడీ ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. వేడి వాతావరణంలో ముంబయిలో ఎన్నికల సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, మహారాష్ట్ర పార్టీ కాంగ్రెస్ బాట పట్టిన రోజు శివసేనకు ముగింపే అవుతుందని శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్కరే భావించారని చెప్పారు. ‘డూప్లికేట్ శివసేనను శిక్షించాలని మహారాష్ట్ర కృతనిశ్చయానికి వచ్చింది.

ఆ శివసేన కాంగ్రెస్ ముందు మోకరిల్లింది’ అని మోడీ అన్నారు. శివసేన నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)తో కూడిన కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తరువాత శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. ఉద్ధవ్ థాక్కరే తండ్రి ప్రారంభించిన పార్టీ పేరును షిండే అట్టిపెట్టుకోగలిగారు. ఆయన బిజెపి భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ‘ఎన్నికల అనంతరం చిన్న పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం అవుతాయి’ అని ప్రధాని మోడీ సూచించారు. ‘మోడీ అణగారిన ప్రజల హక్కుల చౌకీదార్. ఆయన వాటిని లాక్కోనివ్వరు& మతం ఆధారంగా బడ్జెట్‌ను విభజించడం ప్రమాదకరం. కాని కాంగ్రెస్‌కు మైనారిటీ అంటే దాని ప్రియమైన వోటు బ్యాంకు’ అని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News