Sunday, January 19, 2025

రోడ్డుపై గుంతలు పూడ్చిన స్థానికులు

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: ప్రధాన రహదారి గుంతలమాయంగా మారడంతో స్థానికులు మట్టిపోయించి గుంతలను పూడ్చారు. వివరాలకు వెళ్లితో కేటిదొడ్డి మండలం ఉమిత్యాల స్టేజ్ వద్ద రాయచూరు రహదారిపై రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బందికి ఎదుర్కొంటున్నారు.

అంతేగాకుండా వాటి మూలంగా ప్రమాదాలు చోటుచేసుకొని ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో గమనించిన స్థానికులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమాచారం ఇచ్చిన ఫలితం లేదు. దీంతో ఉమిత్యాల గ్రామానికి చెందిన ఈర్న, వీరేష్, సవారెడ్డిలు రోడ్డుపై ఏర్పడ గుంతలను మట్టితో పూడ్చారు. యువకులు చేసిన సామాజిక సేవను స్థానికులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News