Sunday, November 17, 2024

ఢిల్లీ అన్‌లాక్‌లో మరిన్ని సడలింపులు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Lock down closed in Delhi

 

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఢిల్లీ లో ఇప్పటివరకు అన్‌లాక్‌లో అనేక ఆంక్షలు ఎత్తివేయగా ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరిన్ని సడలింపులు ఇచ్చారు. సోమవారం నుంచి సరిబేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని దుకాణాలు, మాల్స్ తెరిచేందుకు , 50 శాతం సీటింగ్ సామర్ధంతో రెస్టారెంట్ల నిర్వహణకు అనుమతించారు. అయితే స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాత్రం మూసే ఉంటాయి. సామాజిక, రాజకీయ, వినోదం, విద్యా సాంస్కృతిక మతపరమైన వేడుకలపై ఆంక్షలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, స్పోర్ట్ కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు స్పాలు, జిమ్‌లు, యోగా కేంద్రాలు పబ్లిక్‌పార్కులు, మూసి ఉంటాయి. వారం రోజులు పరిస్థితిని పరిశీలిస్తామని, కేసులు పెరిగితే కఠిన ఆంక్షలు ఉంటాయని వివరించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ ఎ అధికారులు వంద శాతం, మిగతా గ్రూపుల్లో 50 శాతం సిబ్బంది విధులకు హాజరవుతారు. ప్రైవేట్ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50 శాతం సిబ్బందితో పనిచేయవచ్చు. మార్కెట్ కాంప్లెక్సులు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో భక్తులకు అనుమతి లేదు. జోన్ల వారీగా ఒక వారపు సంతకు అనుమతించారు. ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో వివాహాల నిర్వహణకు నిరాకరించారు. 20 మంది తోనే ఇళ్ల వద్ద కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అలాగే అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదు. సిటీబస్సులు 50 శాతం సీటింగ్ సామర్ధంతో నడుస్తాయి. ఆటోలు, ఈ రిక్షాలు, టాక్సీల్లో ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News