- Advertisement -
బీజింగ్ : చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్‌డౌన్‌ను మంగళవారం మరోసారి పొడిగించినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఈసారి నగరం లోని 2.5 కోట్ల జనాభా మొత్తం కొన్నాళ్లు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరం లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధించారు. కానీ తాజాగా నగరం మొత్తం కఠిన ఆంక్షలను విధించారు. నగరం లోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి వీల్లేదు. దీంతో ఇక్కడివారు ఆహారం, తాగునీటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు.
- Advertisement -