- Advertisement -
భువనేశ్వర్: కోవిడ్ వైరస్ ను కట్టడి చేసేందుకు ఒడిషాలో లాక్‌డౌన్ ను మరిన్ని సడలింపులతో జులై 1 వరకూ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. నెలాఖరు వరకూ వారాంతాల్లో కఠిన లాక్‌డౌన్ ను అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చత్తీస్ ఘఢ్, జార్ఖండ్ సరిహద్దులను తెరవాలని ఒడిషా సర్కార్ బుధవారం నిర్ణయించింది. అయితే ఆంధ్రప్రదేశ్, బెంగాల్ సరిహద్దుల్లో నియంత్రణలు కొనసాగుతాయని నవీన్ పట్నాయక్ వెల్లడించారు. ఒడిషాలో తాజాగా 3,535 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 44 మందిని కరోనా కబలించింది. రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివిటీ రేటు 6.72 శాతం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
Lockdown extension till July 1 in Odisha
- Advertisement -