- Advertisement -
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం ఆరు నుంచి 10గంటల వరకు మినహాయింపు ఇవ్వడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. కూరగాయల మార్కెట్లు, దుకాణాల ముందు జనాలు కిటకిటలాడుతున్నారు. అటు వైన్ షాపులకు నాలుగు గంటలు అనుమివ్వడంతో మద్యం కోసం మందుబాబులు తెల్లవారుజామునుంచే భారీగా క్యూ కట్టారు. లాక్‌డౌన్ విధించడంతో జనం సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణలో యథావిథిగా వ్యాక్సినేషన్ కొనసాగనుంది. టీకా కేంద్రాల దగ్గర జనాలు క్యూలైన్లు కట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులు 33శాతం సిబ్బందితో నడవనున్నాయి. పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మంది, అంత్యక్రియలకు 20 మందికే అనుమతించింది ప్రభుత్వం.
Lockdown that came into force in Telangana
- Advertisement -