Thursday, January 23, 2025

రిజిస్టార్, విసి ఛాంబర్‌లకు తాళాలు

- Advertisement -
- Advertisement -

డిచ్‌పల్లి : తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్టార్‌గా ఎవరో కొనసాగాలన్న విషయంలో సోమవారం వివాదం తలెత్తింది. విద్యార్థి సంఘాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనతో యూనివర్సిటీ అట్టుడికింది. అగ్రహించిన విద్యార్థి సంఘాలు విసి, రిజిస్టర్ ఛాంబర్‌లకు తాళాలు వేసి బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్‌గా యాదగిరిని నియమిస్తూ యూనివర్సిటీ పాలక మండలి గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ రిజిస్టర్ నియామకంలో పాలక మండలి నిర్ణయం చెల్లదని విసి యూనివర్సిటీ రిజిస్టర్‌గా కనకయ్యను నియమించారు.

అయితే దీంతో సోమవారం ఇద్దరు రిజిస్టర్లు చాంబర్‌కు చేరుకొని కూర్చొడానికి సిద్దమయ్యారు. తానే రిజిస్టర్‌ను అంటూ ఇద్దరు వాగ్వివాదానికి దిగారు. విషయం తెలిసి విద్యార్థి సంఘాలు గ్రూపులుగా విడిపోయి ఆందోళనకు దిగారు. మరోవైపు అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం రిజిస్టర్ ఛాంబర్‌కు చేరుకొని వారు కూడా ఆందోళనకు దిగారు. వారంతా అక్కడే బైఠాయించి నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. డిచ్‌పల్లి పోలీసులు రంగంలోకి ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి శాంతింపజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News