Monday, December 23, 2024

జార్ఖండ్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాంచి: రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇంజన్ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మరో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. జార్ఖండ్‌లోని బొకారోలో ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ మరి కొన్ని క్షనాలలో చేరుకోనున్న సమయంలో భోజుదీహ్ స్టేషన్ సమీపంలోని రైల్వే గేటును ఢీకొని ఒక ట్రాక్టర్ రైలు ట్రాకు మీదకు దూసుకువచ్చిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. శాంతాల్ది రైల్వే క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగింది. గేటుకు, రైల్వే ట్రాకుకు మధ్య ట్రాక్టర్ నిలిచిపోయినట్లు ఆయన చెప్పారు. అదే సమయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోందని, అయితే రైలు డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో రైలు రైల్వే గేటుకు కొద్ది దూరంలో నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఇంజన్ డ్రైవర్ బ్రేకులు వేయనట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆగ్నేయ రైల్వే అద్రా డివిజన్‌కు చెందిన డిఆర్‌ఎం మనీష్ కుమార్ తెలిపారు.

మంగళవారం సాయంత్రం గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ బయల్దేరడానికి నిమిషాలు ఆలస్యమైందని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. గేట్ కీపర్ తప్పిదంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఆయన తెలిపారు. గేట్ కీపర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని ఆయన చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు ఆయన తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడంతో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళన చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News