Friday, July 5, 2024

లోక్‌సభ నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ తొలి సెషన్ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ అంతకు ముందు ఆమోదించింది. జూన్ 24న మొదలైన సెషన్‌లో ఏడు సిట్టింగ్‌లలో 34 గంటలకు పైగా కార్యకలాపాలు సాగాయని, సభ ఉత్పాదకత 103 శాతం అని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా వెల్లడించారు.

ఈ సెషన్ తొలి రెండు రోజులలో 539 మంది లోక్‌సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఓమ్ బిర్లా జూన్ 26న లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో 68 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News