- Advertisement -
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టిఏ) నిర్వహించిన ‘నీట్’ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా బ్లాక్ లోక్ సభ, రాజ్యసభలోనూ శుక్రవారం పట్టుబట్టాక సభలో గలాభ మొదలయింది. దాంతో రెండు సభలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశ మొదలయినప్పటికీ వేడి చల్లారకపోయే సరికి లోక్ సభ ప్రొసీడింగ్స్ ను జులై1 (సోమవారం)కి వాయిదా వేశారు.
బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ లోక్ సభలో నేడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ జులై 2న సమాధానాలు ఇవ్వనున్నారు. బిజెపి ఎంపీ బన్సురీ స్వరాజ్ రెండో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- Advertisement -