- Advertisement -
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు నేడు ఉదయం వాయిదా పడ్డాయి. ఇండియా బ్లాక్ కు చెందిన ప్రతిపక్షాలు రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ మీద బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దానిపై రగడ జరిగి ఉదయపు సమావేశాలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మల్లికార్జున ఖర్గే నిందించారు. కాగా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా జార్జ్ సోరోస్- కాంగ్రెస్ లింక్ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. ఇదిలావుండగా ప్రభుత్వం మూడు బిల్లులను రాజ్యసభలో పరిశీలనకు ప్రవేశపెట్టాలనుకుంటోంది. ఏదిఏమైనప్పటికీ ఉభయ సభలు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం కానున్నాయి
- Advertisement -