Friday, December 20, 2024

అదానీ రచ్చతో 6వ తేదీకి వాయిదా పడ్డ ఉభయసభలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటులోని ఉభయసభలు…లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారం రెండో రోజున కూడా వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు అదానీ అంశాన్ని లేవనెత్తి విచారణకు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ పర్యవసనం చోటుచేసుకుంది. ఉభయసభలు తిరిగి సోమవారం అంటే ఫిబ్రవరి 6న సమావేశం కానున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నాయి. కానీ అధికార పక్షం ససేమీరా అంటోంది. అదానీ గ్రూప పన్నులు ఉండని దేశాల నుంచి డబ్బును తరలించి భారత స్టాక్ మార్కెట్‌ను ఓ ఆట ఆడుకుంటున్నాయని హిండెన్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది.

ఈ మధ్య గౌతమ్ అదానీ ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి హైఫా రేవును స్వాధీనం చేసుకున్నారు. ఆయన తిరిగి భారత్‌కు వచ్చాక పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్‌పిఓను ఉపసంహరించుకున్నారు. పైగా మదుపరుల డబ్బు తిరిగి చెల్లించేస్తానన్నారు. ఆయన ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు తతంగం అంతా జరుగుతోంది.

అదానీ వ్యాపార వ్యవహారాలపై దర్యాప్తు జరపాలని ప్రతిపక్షం కోరడంతో రాజ్యసభను వాయిదా వేసేశారు. ఇక లోక్‌సభలో స్పీకర్ ఓమ్ బిర్లా నిరసనలు ఆపేసి, చర్చలో పాల్గొనండి అని సభ్యులను వేడుకున్నారు. సభ ఉదయపు సెషన్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ సభ సమావేశం అయినప్పుడు ప్రతిపక్ష సభ్యులు అదానీపై దర్యాప్తు జరపాలన్న డిమాండ్‌పై పట్టుపట్టారు. అప్పుడు సభకు అధ్యక్షత వహించిని రాజేంద్ర అగర్వాల్ పార్లమెంటరీ పత్రాలను సమర్పించడానికి అనుమతించారు. ప్రతిపక్ష సభ్యులు కూర్చొవాలని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాలని కోరారు. అయినప్పటికీ నిరసన కొనసాగింది. ప్రధాని మోడీ పెదవి కూడా విప్పలేదు. చివరికి సభా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News