Saturday, November 23, 2024

బీమా రంగంలో ఎఫ్‌డిఐ పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Lok Sabha approves bill to FDI hike in Insurance Sector

న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎప్‌డిఐ) 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లు సోమవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ బీమా రంగంలో ఎఫ్‌డిఎ పరిమితిని పెంచడం వల్ల బీమా కంపెనీలు అదనపు నిధులను సేకరించడంతోపాటు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కగలవని అన్నారు. బీమా(సవరణ)బిల్లు, 2021 గత వారం రాజ్యసభ ఆమోదం పొందింది.
ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, కాని ప్రైవేట్ రంగానికి చెందిన బీమా కంపెనీలు సొంతంగా నిధులు సమకూర్చుకోవలసి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బీమా కంపెనీలు పరపతికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయని, పెట్టుబడలలో పురోగతి లేనిపక్షంలో ఆ కంపెనీలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని ఆమె చెప్పారు. వీటిని పరిష్కరించడానికే ఎఫ్‌డిఐ పరిమితిని పెంచవలసిన అవసరం ఏర్పడిందని ఆమె వివరించారు. కొవిడ్-19 పరిస్థితులలో బీమా కంపెనీల కష్టాలు మరింత పెరిగాయని ఆమె తెలిపారు.

Lok Sabha approves bill to FDI hike in Insurance Sector

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News