Monday, November 25, 2024

జిఎస్‌టి అప్పిలేట్ ట్రిబ్యునల్స్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జిఎస్‌టి అప్పెలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యుల వయసు పెంపునకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా పీతారామన్ సభలో బిల్లును ప్రవేశపెడుతూ, జిఎస్‌టి ట్రిబ్యునల్ బెంచ్‌లు ప్రారంభమైన తర్వాత హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో జిఎస్‌టి డిమాండ్లకు వ్యతిరేకంగా కేసులు వేస్తున్న పన్ను చెల్లింపుదారులు తమ కేసులను కోర్టులనుంచి ఉపహరించుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.

అనంతరం కేంద్ర వస్తు సేవల పన్ను (రెండో సవరణ) బిల్లు2023ను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. జిఎస్‌టి అప్పెలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు, సభ్యుల వయసు ప్రస్తుతం 65 ఏళ్లు, 65 సంవత్సరాలు ఉండగా దాన్ని 70 ఏళ్లు, 67 సంవత్సరాలకు పెంచడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ సవరణ ప్రకారం జిఎస్‌టి అప్పెలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు , సభ్యులు నాలుగేళ్ల పాటు లేదా అధ్యక్షుడైతే 70 ఏళ్లు వచ్చే వరకు, సభ్యులు 67 ఏళ్ల దాకా ఏది ముందయితే అంతవరకు పదవిలో ఉండవచ్చు.ఈ బిల్లు ఆమోదంతో జిఎస్‌టి అప్పెలేట్ ట్రిబ్యునల్ సభ్యుల సర్వీసును ట్రిబ్యునల్ రిఫార్మ్ చట్టం 2021తో సమానమవుతుందని మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News