Saturday, November 16, 2024

రెట్రోస్పెక్టివ్ టాక్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

Lok Sabha approves retrospective tax bill

బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: విదేశీ కంపెనీలు పరోక్షంగా ఇతర దేశాలకు తరలించిన భారత్‌లోని ఆస్తులపై పాత తేదీలనుంచి పన్ను విధించే వీలు కల్పించే వివాదాస్పద రెట్రోస్పెక్టివ్ టాక్స్( పునరావృత్త పన్ను)కు స్వస్తి పలికే బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. పెగాసస్ వ్యవహారం, రైతు సమస్యలు తదితర అంశాలపై విపక్షాల ఆందోళన మధ్యే సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపినప్పుడు 2012 నాటి ఈ చట్టాన్ని ఉపయోగించి కైర్న్ ఎనర్జీ, వొడాఫోన్‌లాంటి విదేశీ కంపెనీలపై పన్నులకు సంబంధించి ఉన్న అన్ని వివాదాలు రద్దవుతాయి. బిల్లుపై అంశాలవారీ చర్చ, చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లుప్తంగా సమాధానం ఇచ్చిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు.

2012 నాటి ఈ చట్టాన్ని ఆర్థిక మంత్రి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసే చెడ్డ చట్టంగా అభివర్ణించారు. ఈ చట్టానికి సంబంధించి 17 వివాదాలు వివిధ న్యాయస్థానాల్లో ఉన్నాయని, విదేశీ కంపెనీలకు సంబంధించిన వాటాల పరోక్ష బదిలీపై పన్ను విధించరాదని 2012లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, దానికి వివరణగానే ఈ బిల్లును తీసుకు వచ్చినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ చట్టానికి సంబంధించిన వివిధ నిబంధనలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చిన విషయాన్ని కూడాఆమె గుర్తు చేశారు. పాత చట్టం కింద వసూలు చేసిన మొత్తాన్ని ఆయా కంపెనీలకు వడ్డీ లేకుండా తిరిగి చెల్లించడం జరుగుతుందని నిర్మాలా సీతారామన్ చెప్పారు. ఆ మొత్తం దాదాపు రూ.8,100 కోట్లు ఉంటుందని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News