Thursday, January 23, 2025

ప్రజా ప్రతినిధుల సభ

- Advertisement -
- Advertisement -

BJP MPs give warm welcome to Prime Minister in Lok Sabha

ఆర్టికల్-81 లోక్‌సభ గురించి పేర్కొంటుంది.
లోక్‌సభను ప్రజా ప్రతినిధుల సభ, తాత్కాలిక సభ, దిగువ సభ అని పిలుస్తారు.

సభ్యుల సంఖ్య
గరిష్ట షభ్యుల సంఖ్య 552.
వీరిలో 530 మంది సభ్యులను రాష్ట్రాల నుండి ప్రజలు ఎన్నుకుంటారు.
20 మంది సభ్యులను కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు ఎన్నుకుంటారు.
ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
నోట్: ఆర్టికల్ 331 ప్రకారం లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్స్‌కి తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్‌ని నామినేట్ చేస్తారు.
ఆంగ్లో ఇండియన్స్ అనగా భారత సంతతి కలిగిన ఐరోపా వాసులు.
లోక్ సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 345.
వీరిలో రాష్ట్రాలనుండి 530 మంది సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు.
కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 13 మంది సభ్యులు ఎన్నుకోబడతారు.
ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఉంటారు.

లోక్ సభ సభ్యుల అర్హతలు

25 ఏళ్ల వయసుండాలి.
మిగతా అన్నీ రాజ్యసభ సభ్యుల అర్హతలే.
లోక్‌సభ పదవి కాలం 5 ఏళ్లు.

ప్రత్యేక సందర్భాలు

లోక్ సభను గడువుకు ముందే రద్దు చేసేది ప్రధాని సలహాపై రాష్ట్రపతి.
జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు 1 ఏడాది చొప్పున ఎంత కాలమైనా పొడిగించవచ్చు.
ఉదా: 5వ లోక్‌సభ 1971 నుండి 1977 (6 years).
గడువు కాలం ముగిసిన లోక్‌సభ దానంతట అదే రద్దవుతుంది.
లోక్‌సభకు రిజర్వేషన్లు వర్తిస్థాయి.
ఆర్టికల్ 330: ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని ప్రత్యేక స్థానాలు వారి జనాభా ప్రాతి పదికన రిజర్వు చేయబడతాయి. (ఎస్‌సీ 84, ఎస్టీ 47)
ఇప్పుడున్న లోక్‌సభ సీట్లు 2026 వరకు పెంచరాదు.
పార్లమెంట్ భవనం పేరు సంసద్ భవన్
అత్యధిక సీట్లు కలిగిన రాష్ట్రం యూపీ (80)
తక్కువ లోక్‌సభ స్థానాలు గల రాష్ట్రాలు సిక్కిం, నాగాలాండ్, మిజోరం
తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17

సభాధ్యక్షులు

లోక్‌సభ అధ్యక్షుడిని స్పీకర్ అని అంటారు.
స్పీకర్ పదవిని బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
ప్రొటెం స్పీకర్ నూతనంగా ఏర్పడిన లోక్‌సభ సమావేశానికి అధ్యక్షడిగా రాష్ట్రపతి నియమించే వ్యక్తి ప్రొటెం స్పీకర్.
ప్రొటెం స్పీకర్ విధి: లోక్‌సభకు నూతన స్పీకర్ ఎన్నిక
ప్రొటెం స్పీకర్‌గా లోక్‌సభలో సీనియర్ అభ్యర్థిని నియమించు సాంప్రదాయం ఫ్రాన్స్ నుండి గ్రహించారు.
లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.

స్పీకర్ పదవికాలం 5 ఏళ్లు.

సభ రద్దు అయిన స్పీకర్ పదవి రద్దుకాదు. లోక్‌సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభకు స్పీకర్ సంతకంతో పంపుతారు.
రాష్ట్రపతి రాజీనామా అధికారికంగా ప్రకటించేది స్పీకర్. రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇస్తారు.
రాజీనామా: స్పీకర్ తన రాజీనామా ను డిప్యూటీ స్పీకర్‌కు అందిస్తారు.
డిప్యూటీ స్పీకర్ రాజీనామాను స్పీకర్‌కు అందిస్తారు.
తొలగింపు: స్పీకర్ తొలగింపు తీర్మానంను 14 రోజుల ముందుగా లోక్‌సభ సెక్రటరీకి ఇవ్వాలి.
లోక్‌సభ సభ్యులు 1/2 మెజారిటీ ద్వారా తొలగించవచ్చు.

స్పీకర్ తొలగింపు

లోక్‌సభ సభ్యుల్లో 50 మంది సంతకాలతో కూడిన తీర్మానంను లోక్‌సభ సెక్రెటరీకి ఇవాలి.
లోక్‌సభ సెక్రెటరీ 14 రోజుల్లోగా తీర్మానంపై చర్చను ప్రారంభించాలి.
చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది.
1/2 మెజారిటీలో స్పీకర్‌ను తొలగించవచ్చు.
స్పీకర్‌పై తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు.
సభకు సాధారణ సభ్యుడివలె హాజరుకావచ్చు.
తన అభిప్రాయాలు వెల్లడించవచ్చు.
ఓటు వేయవచ్చు కాని సభ అధ్యక్షుడు వేసే కాస్టింగ్ ఓటు (నిర్ణయాక ఓటు వేయరాదు)
కాస్టింగ్ ఓటు (నిర్ణయాక ఓటు): సభలో ఒక బిల్లుపై సమాన ఓట్లు వచ్చినప్పుడు సభలో ఉన్న సంక్షోభంను నివారించేందుకు సభ అధ్యక్షుడు వేసే ఓటు.

డిప్యూటీ స్పీకర్

లోక్ సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
విధులు: స్పీకర్ లేనప్పుడు సభకు తాత్కాలిక స్పీకర్‌గా వ్యవహరిస్తారు.
డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం.
రాజీనామా: స్పీకర్‌కి సమర్పిస్తారు.
తొలగింపు: స్పీకర్ తొలగింపు ఎలా చేస్తారో డిప్యూటీ స్పీకర్‌ని అదే పద్ధతిలో తొలగిస్తారు.

ప్యానల్ స్పీకర్

వీరి సంఖ్య 6
వీరిని లోక్‌సభ స్పీకర్ నియమిస్తాడు.
విధులు: లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు సభ అధ్యక్షులుగా వీరిలో ఒకరు వ్యవహరిస్తారు.

స్పీకర్ విధులు

లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు.
సభలో సభ్యులు ప్రసంగించుటకు స్పీకర్ అనుమతి అవసరం.
సభలో తీర్మానం లేదా బిల్లులు ప్రవేశపెట్టాలంటే స్పీకర్ అనుమతి అవసరం.
సభా కార్యక్రమాలకు ఎవరైనా అడ్డంకులు కలిగిస్తే వారిని సభ నుండి సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.

లోక్‌సభ ప్రత్యేక అధికారాలు

ప్రభుత్వ ఏర్పాటు: లోక్ సభలో మెజారిటీ పొందిన పార్టీ లేదా మెజార్టీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
విశ్వాస తీర్మానం: ఎన్నికల్లో మెజారిటీ పొందిన పార్టీ విశ్వాసం పొందితేనే మనుగడ ఉంటుంది.
ఎన్నికల్లో మెజారిటీ పొందిన పార్టీ లోక్‌సభలో విశ్వాసం పొందుతారు.

అవిశ్వాస తీర్మానం: దీనిని ప్రతి పక్షం అధికార ప్రభుత్వం మీద లోక్‌సభలో ప్రవేశ పెడుతుంది.
ఈ తీర్మానం మద్దతుకి 50 మంది లోక్‌సభ సభ్యుల మద్దతు అవసరం.
అవిశ్వాస పరీక్ష నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
ఆర్థిక బిల్లు: ఆర్థిక బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితో.. ముందుగా లోక్‌సభలోనే ప్రవేశ పెట్టాలి.
బడ్జెట్: ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెడతారు.
లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది.
ఓటింగ్‌లో బడ్జెట్ ఓడిపోతే /ఆమోదం తెలుపకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
ప్రభుత్వ బిల్లు లోక్ సభలో ఓడితే రాజీనామ చేయాలి.
ప్రైవేటు సభ్యుడు ప్రవేశ పెట్టిన బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించి ఆ బిల్లు నెగ్గితే రాజీనామ చేయాలి.
ప్రత్యేక అధికారాలు మినహాయిస్తే మిగతా అన్ని అధికారాలు ఉభయ సభలు కలిగి ఉంటాయి.

రాజ్యసభ ప్రత్యేక అధికారాలు

ఆర్టికల్ 249 ప్రకారం దేశంలో అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలని రాజ్యసభ 2/3 వంతులో తీర్మానం చేస్తే పార్లమెంట్ చట్టం చేస్తుంది.
అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలని సూచించేది రాజ్యసభ.
అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేసేది పార్లమెంట్.
అఖిల భారత సర్వీసులను నియామకం చేసేది రాష్ట్రపతి.
రాష్ట్ర జాబితాలో గల ఒక అంశం జాతీయ ప్రాధాన్యం కలిగి ఉందని రాజ్యసభ 2/3 మెజార్టీతో బిల్లును ఆమోదిస్తే .. పార్లమెంట్ ఆ అంశంపై చట్టం చేస్తుంది.
ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.

సమావేశాలు..
పార్లమెంట్ ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశం కావాలి. అనగా ప్రతి రెండు సమావేశాల మధ్య కాలం కనీసం 6 నెలలు.
సాధారణంగా పార్లమెంట్ మూడు సార్లు సమావేశమవుతుంది. అవి.
1. బడ్జెట్ సమావేశాలు
2. వర్షాకాల సమావేశాలు
3. శీతాకాల సమావేశాలు.

పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించేది రాష్ట్రపతి.
ప్రోరోగ్: సమావేశాలు ముగియటం లేదా సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడం.
అడ్జర్న్: సభ ఎప్పటివరకు వాయిదా వేశారనేది..తేదీతో పాటు సమయం చెప్పి వాయిదా వేయడం
సైన్‌డై(నిరవదిక వాయిదా): సభ ఎప్పటివరకు వాయిదా వేశారనేది.. తేదీ, సమయం చెప్పకపోవడం. దీనినే నిరవదిక వాయిదా అంటారు.
సభలో కోరం లేకపోతే స్పీకర్ సభను వాయిదా వేస్తారు.
కోరం: కోరం అంటే సభ ప్రారంభించడానికి కావలసిన సభ్యుల సంఖ్య. లోక్‌సభలో కోరం 1/10 అనగా 55 మంది సభ్యులు కావాలి.
ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారు.
పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం స్పీకర్ ఒక సభ్యుడిని సభ నుండి భహిష్కరించే అధికారం కలిగి ఉంటారు.
లోక్‌సభ సభ్యుడిని అరెస్టు చే యాలంటే ముందుగా లోక్‌స భ స్పీకర్ అనుమతి అవసరం.
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను నియమించేది స్పీకర్.
లోక్‌సభ సిబ్బందిని నియమించేది స్పీకర్.
ఒక పార్టీకి సభలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చేది స్పీకర్.
నోట్: ఒక పార్టీ ప్రతిపక్ష హోదా పొందాలంటే మొత్తం సీట్లలో 1/10వ వంతు సీట్లు రావాలి.
అనగా ప్రతిపక్ష హోదా దక్కాలంటే 55 సీట్లు రావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News