Saturday, November 23, 2024

ఓటెత్తిన పల్లె

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటి, రెండు చిన్న, చిన్న ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలిం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17 లోక్‌సభ ని యోజకవర్గాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల జరిగిన పో లింగ్‌కు ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం కొంచెం మందకొడిగా పో లింగ్ కొనసాగగా, మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకుం ది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 61.16 శాతం ఓటింగ్ నమోదైంది. పలుచోట్ల సాయంత్రం వేళ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. సాయంత్రం 6 లోపు పోలింగ్ బూత్‌లో ఉన్నవారు గంటల తరబడి క్యూలైన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలో నిలబడినవారు పూర్తయ్యే వరకు పోలింగ్ కొనసాగింది. ఈ ఓటింగ్ ప్రక్రియలో యువత, పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉదయమే ఓట్లు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

జగిత్యాల జిల్లా చిన్నకొలువాయిలో శాతం ఓటింగ్
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొలువాయిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. గ్రామంలో 100 శాతం ఓటు వేసి అక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 110 ఓట్లు ఉండగా, ఎవరూ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ నమోదుపై జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చిన్న కొలువాయి ఓటర్లను అభినందించారు. తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువ ఓటర్లకు ఎన్నికల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ మడల్ పోలింగ్ కేంద్రంలో స్వీప్ కమిటి ఆధ్వర్యంలో తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువతకు పుష్పగుచ్చాలందించి డప్పులతో స్వాగతం పలికారు. మహబూబ్‌గర్ జిల్లా జడ్చర్లలో పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. పూలతోరణాలు, బెలూన్లు కట్టి అలంకరించారు. ఆదర్శపొలింగ్ కేంద్రంకావడంతో సరికొత్తగా తీర్చిదిద్దినట్లు అధికారులు వివరించారు. నల్గొండలో పర్యావరణహితంగా కొబ్బరి, అరటి ఆకులు, చిలుకలు, మామిడి తోరణాలతో పర్యావరణ హితంగా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంటలకే ముగిసిన పోలింగ్
మావోయిస్టుల ప్రాబల్యమున్న ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది స్వతంత్రులు. అధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 45 మంది పోటీలో ఉండగా తక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలోనిలిచారు. పోలింగ్ ప్రారంభంలో కొన్నిచోట్ల ఇవిఎంలు మొరాయించగా అధికారులు సరిచేశారు. అనంతరం ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.

ప్రజల నుంచి మంచి స్పందన సిఇఒ వికాస్‌రాజ్
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. తుది ఓటింగ్ శాతం వివరాలను మంగళవారం వెల్లడిస్తామని తెలిపారు. 1400 కేంద్రాల వద్ద సాయంత్రం 6 తర్వాత ఓటర్లు ఉన్నారని అన్నారు. సోమవారం మొత్తం 400 ఫిర్యాదులు రాగా, వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. సిఇఒ వికాస్‌రాజ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైందని పేర్కొన్నారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగిందని చెప్పారు. జిపిఎస్ ఉన్న వాహనాల్లో ఇవిఎంలు తరలిస్తామని స్పష్టం చేశారు. ఇవిఎంల తరలింపు కొన్నిచోట్ల అర్ధరాత్రి ఒంటిగంట వరకు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్‌పై మంగళవారం స్క్రూటినీ ఉంటుందని, ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే అప్పుడే తెలుస్తుందని వివరించారు.పోలింగ్ సజావుగా సాగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సిఎంపై ఫిర్యాదును విచారిస్తున్నాం :సిఇఒ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని సిఇఒ వికాస్ రాజ్ తెలిపారు. కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం సిఎం వికాస్‌రాజ్ ప్రెస్‌మీట్ నిర్వహించడంపై బిజెపి నేత రఘునందన్‌రావు ఇసికి ఫిర్యాదు చేశారు.మోడీ, బిజెపిపై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సా.5 గంటలకు 61.16 శాతం పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 61.16 పోలిం శాతం నమోదు అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ప్రకారం భువనగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్‌లో అత్యల్పంగా 39.17 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News