Sunday, January 19, 2025

కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్..

- Advertisement -
- Advertisement -

2024 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా 49 నియోజకవర్గాల్లో మహారాష్ట్రలో 13, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమబెంగాల్‌లో 7, బీహార్‌లో 5,ఝార్ఖండ్‌లో 3, ఒడిశాలో 5, జమ్ముకశ్మీర్‌లో 1, లడ్డాఖ్‌లో 1 వంతున స్థానాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 8.95 కోట్ల మందిలో 4.26 కోట్ల మంది మహిళలు, 5109 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News