Wednesday, January 22, 2025

కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లో 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. కేరళలో 20 లోక్ సభ స్థానాలకు, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, యూపీలో 8, మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్ లో 6, బిహార్ లో 5, అసోంలో 5, బెంగాల్ లో 3, ఛత్తీస్ గఢ్ లో 3, జమ్ముకశ్మర్, మణిపుర్, త్రిపురలో ఒక్కో లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13 రాష్ట్రాల్లో జరుగుతున్న ఫేజ్ 2 లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో మధ్యాహ్నం 1 గంటల వరకు దాదాపు 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News