Monday, December 23, 2024

ఏప్రిల్‌ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు
విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరుగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయ సంకల్ప యాత్రలో భాగంగా వారసిగూడాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలో అవీనితిరహిత, శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందన్నారు. ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికే విజయ సంకల్ప యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు.

గత నెల 20వ తేదీ నుండి ఈ యాత్రలు కొనసాగుతున్నాయని, అంబర్ పేటలో చౌరస్తాలో జరిగే సభతో మన యాత్ర పూర్తి అవుతుందని, కరోనా వంటి కిష్ట సమయంలో దేశాన్ని మోడీ ఎలా కాపాడారో అందరికి తెలిసిందేనని గుర్తు చేశారు. గత పాలకుల హయాంలో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ముంబై వంటి నగరాలలో పాకిస్థాన్ ఐఎస్‌ఎస్ ఉగ్రవాదుల దాడులను చూశామన్నారు. మోడీ పాలన ప్రారంభమైన తరువాత దేశం ప్రశాంతంగా మారిందని, భారత్‌ను ప్రపంచదేశాలు పొగిడే విధంగా చేశారన్నారు. దేశంలో బెస్ట్ లీడర్‌గా వెలుగొందుతున్నారని, అన్ని సర్వేలలో మోడీ టాప్ లో నిలుస్తున్నారని, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారన్నారు. అందరికి కడుపు నింపడానికి ఉచితంగా బియ్యం ఇస్తున్నారని, మరో 5 ఏళ్ళ పాటు ఉచిత బియ్యాన్ని పంపణీ చేయనున్నట్లు తెలిపారు. అయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా అందిస్తున్నట్లు దేశంలో ప్రతి మహిళకు వంట గ్యాస్ అందించిన చరిత్ర బిజెపి ప్రభుత్వాదేనన్నారు.

అంతేకాకుండా గ్రామ పంచాయితీల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, బొగ్గు, 2జీ కుంభకోణాలతో రూ.12 లక్షల కోట్లను కాంగ్రెస్ పార్టీ దోచుకుందని, దీంతో ప్రజలు అవీనితిరహిత పాలకుడు కావాలి అని మోడీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవీనితి కూడా జరగలేదని, ఎవరూ కూడా మోడీని అవినీతిపరుడు అని వేలు పెట్టి చూపలేరని, దేశ ప్రజల భవిష్యత్, పిల్లల భవిష్యత్, పేదల సంక్షేమం కోసం కంకణం కట్టుకొని నీతి నిజాయితీతో పని చేసే నాయకుడు నరేంద్ర మోడీ.  త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి బిజెపి రావాలని దేశ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News