- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నామినేషన్ దాఖలు గడువు గురువారంతో ముగియనున్నది. ఈ నెల 18వ తేదీన నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, బుధవారం నాటికి 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవీలత, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ శెట్కార్ తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు గడువు గురువారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు వివిధ స్థానాలలో నామినేషన్లు వేశారు.
- Advertisement -