- Advertisement -
న్యూఢిల్లీ : లోక్‌సభలో శుక్రవారం ఐఐఎం బిల్లు ఆమోదం పొందింది. దేశంలోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ల వ్యవహారాలపై రాష్ట్రపతికి పూర్తి అధికారాలను కల్పించేందుకు ఈ బిల్లును సంకల్పించారు. జులై 28న ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే రాష్ట్రపతికి అధికారాల అప్పగింత పేరిట ఈ విద్యాసంస్థల అటానమీని దెబ్బతీస్తున్నారని, కేవలం పిఎంఒ చెప్పుచేతల్లో ఇవి ఉండేలా చేసేందుకు దీనిని తీసుకువచ్చారని ప్రతిపక్షం విమర్శించింది.
చర్చకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబిచ్చారు. ఐఐఎంల విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనేది కేవలం విపక్షాల భ్రమ అని తెలిపారు. మణిపూర్ ఘర్షణలపై ప్రతిపక్షాలు సభలో నినాదాలకు దిగుతూ ఉన్న గందరగోళం నడుమనే ఈ బిల్లుకు సభ ఆమోదం దక్కింది. ఈ విషయాన్ని రికార్డుల మేరకు అధికారికంగా ప్రకటించారు.
- Advertisement -