Wednesday, January 22, 2025

కొత్త క్రిమినల్ చట్టాలకు పార్లమెంటు ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తీసుకువచ్చిన మూడు కొత్త బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. బుధవారం లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లులకు గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. చాలావరకు ప్రతిపక్ష సభ్యులు సస్పెండయిన నేపథ్యంలో లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలో కూడా ఈ బిల్లులకు ఎలాంటి అడ్డంకీ ఎదురు కాలేదు. బిల్లులపై జరిగిన స్వల్ప చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిసూ బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సిఆర్‌పిసి), ఎవిడెన్స్ చట్టం స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త బిల్లులు క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో నూతనశకానికి నాంది పలుకుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా సభలో లేనప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీనుద్దేశించి షా పరోక్షంగా విమర్శలు చేస్తూ‘ ఇటాలియన్ కళ్లజోడు ధరించిన వారు కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించిన పార్లమెంటు ఘనత అర్థం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.పాత చట్టాల స్థానంలో తీసుకువచ్చిన భారతీయ న్యాయ( రెండవ) సంహిత, సురక్షా( రెండవ) సంహిత, భారతీయ సాక్ష( రెండవ) బిల్లులకు ఉభయ సభల ఆమోదం లభించడంతో ఇవి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తాయి. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత ఇవి చట్టాలుగా మారుతాయి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News