- Advertisement -
న్యూఢిల్లీ : 125 ఏళ్ల నాటి పాత భారత పోస్టాఫీస్ చట్టాన్ని రద్దు చేసి సవరించిన సరళీకృత పోస్టాఫీస్ బిల్లుకు పార్లమెంట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను, భారత పోస్టాఫీస్ వ్యవస్థ పరిణామాన్ని కొత్త బిల్లు ద్వారా సరళీకృతం చేశారు. పౌర కేంద్రీకృత సర్వీస్ నెట్‌వర్క్‌గా సవరించారు. పోస్టాఫీస్ బిల్లు 2023ను రాజ్యసభ డిసెంబర్ 4న ఆమోదించింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ స్వల్ప చర్చల మధ్య డిసెంబర్ 13న ఆమోదించింది.
- Advertisement -