Monday, January 20, 2025

క్విట్ ఇండియా ఉద్యమ అమరులకు పార్లమెంట్ నివాళి

- Advertisement -
- Advertisement -

క్విట్ ఇండియా ఉద్యమం 82వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్ శుక్రవారం అమరులను సంస్మరించుకున్నది. లోక్‌సభ, రాజ్యసభ అమరవీరులకు నివాళి అర్పించాయి. ప్రాణ త్యాగం చేసిన వారి పట్ల గౌరవ సూచకంగా ఉభయ సభలు కొన్ని క్షణాలు మౌనం పాటించాయి. శుక్రవారం సభా కార్యకలాపాలను ప్రారంభించే ముందు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖర్ 1942లో మహాత్మా గాంధీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పటి చారిత్రక సందర్భాన్ని గుర్తు చేశారు.

‘మహాత్మా గాంధీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన చారిత్రక ఘట్టం 82వ వార్షికోత్సవం ఇది. ‘చావో రేవో’ అని ఆయన ఇచ్చిన పిలుపు దేశాన్ని జాగృతం చేసింది. అది తుదకు భారత్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం సాధించేందుకు దారి తీసింది’ అని ధన్‌ఖర్ తెలిపారు. లోక్‌సభలో స్పీకర్ ఓమ్ బిర్లా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నవారికి, అమరవీరులకు నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News