Sunday, December 22, 2024

మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు..మరోసారి రీపోలింగ్

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో మరోసారి రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ ఓటింగ్ సమయంలో మణిపూర్ ఔటర్ లోక్‌సభ స్థానంలోని 6 పోలింగ్ కేంద్రాల దగ్గర హింసాత్మక ఘటనలు జరిగాయి.

దీంతో ఆ 6 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌ను రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆరు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News