Sunday, January 19, 2025

లక్షద్వీప్ ఎంపిపై అనర్హత ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లక్షద్వీప్ ఎన్‌సిపి లోక్‌సభ సభ్యుడు మహమ్మద్ ఫైజల్ అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ గురువారం ఎత్తివేసింది. హత్యాయత్నం కేసులో ఆయనకు విధించిన శిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసిన దాదాపు నెలరోజుల తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటును ఎత్తివేసింది. ఫైజల్ అనర్హత న్యాయస్థానాలు తదుపరి ప్రకటించే తీర్పులకు లోబడి ఉంటుందని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒక హత్యాయత్నం కేసులో ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కవరాట్టి సెషన్స్ కోర్టు చెప్పడంతో ఈ ఏడాది జనవరి 11న ఆయనను తొలిసారి ఎంపిగా డిస్‌క్వాలిఫై చేశారు. దీనిపై ఆయన కేరళ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా ఆ శిక్షను నిలుపుదల చేయడానికి నిరాకరించడంతో ఈ ఏడాది అక్టోబర్ 4న మరోసారి ఆయనను సస్పెండ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆయనకు విధించిన శిక్షను నిలిపుదల చేయడంతో అనర్హతను ఎత్తివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News