Monday, November 18, 2024

8 మంది ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బుధవారం సంభవించిన భద్రతా వైఫల్యానికి సంబంధించి 8 మంది ఢిల్లీ పోలీసులను గురువారం సస్పెండ్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. సస్పెండ్ అయిన ఈ పోలీసు సిబ్బంది పార్లమెంట్ భద్రత కోసం డిప్యుటేషన్‌పై వచ్చారు. సందర్శకులు, మీడియా సిబ్బందిని తనిఖీ చేసి పార్లమెంట్ లోపలకు పంపించడం వీరి బాధ్యత. సస్పెండ్ అయిన పోలీసులలో రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేశ్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు. పార్లమెంట్ భద్రత కోసం వారు డిప్యుటేషన్‌పై వచ్చినప్పటికీ వారు లోక్‌సభ సచివాలయం నియంత్రణలో ఉండరని, వారు తమ పోలీసు విభాగం నియంత్రణలోనే ఉంటారని వర్గాలు తెలిపాయి.

పార్లమెంట్ కాంప్లెక్స్‌తోపాటు పార్లమెంట్ భవనం భద్రత ఢిల్లీ పోలీసు సిబ్బంది పరిధిలో ఉంటుందని, సందర్శకులు, మీడియా సిబ్బందిని తనిఖీ చేయడం వీరి బాధ్యతని వర్గాలు తెలిపాయి. బుధశారం లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచి సభ్యులు కూర్చునే ఛాంబర్‌పైకి దూకి సభలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. సప్మోక్ బాంబులు ప్రయోగించి అలజడి సృష్టించిన మనోరంజన్‌డి, సాగర్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News