పార్లమెంట్‌లో బుధవారం మధ్యాహ్నం 1.02 గంటలకు జీరో అవర్‌లో ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని పసుపు రంగు పొగను వెదజల్లుతూ సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి లోక్‌సభ ఛాంబర్‌లోకి పరుగెత్తడంతో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపించే బాధ్యత తనదని లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటి అనేదానిపై విచారణ చేస్తున్నామన్నారు. ఎంపిల ఆందోళనను పరిగణలోకి తీసుకున్నామని స్వీకర్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని ఆయన వెల్లడించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించామన్నారు. విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకొస్తామని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు అమోల్ షిండే కాగా, మరొక మహిళ పేరు నీలమ్ కౌర్ గా గుర్తించారు. నియంతృత్వం ఇక చెల్లరు అంటూ నిందితులు మీడియా ముందు నినాదాలు చేశారు.