Friday, December 20, 2024

తండ్రి తరఫున లంచం.. ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని చెన్నగిరి ఎమ్మెల్యే విరూపాక్ష తరఫున లంచం పుచ్చుకుంటున్న ఆయన కుమారుడు ఎంవి ప్రశాంత్ కుమార్‌ను అరెస్టు చేసిన లోకాయుక్త పోలీసులు ఆయన ఇంట్లో నుంచి రూ.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఐఎఎస్ అధికారి, కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ ఎం నివాసంపై కూడా పోలీసులు దాడి చేసి సోదాలు జరపగా అక్రమాస్తులకు సంబంధించిన విలువైన పత్రాలేవీ లభించలేదు. గురువారం రాత్రి ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు.

బెంగళూరులోని క్రిసెంట్ రోడ్డులోని ఎం స్టూడియోలో ప్రశాంత్ కుమార్ రూ.40 లక్షల లంచాన్ని పుచ్చుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. ప్రశాంత్ ఇంట్లో ఇప్పటివరకు రూ.8.02 కోట్ల ఆస్తులు లభించాయని, ఈ అవినీతి కేసులో ప్రశాంత్, ఆయన తండ్రి మడల్ విరూపాక్షప్ప నిందితులని అధికారులు తెలిపారు. ప్రశాంత్ ఇంట్లో లభించిన నదుతోపాటు బంగారు నగలు, వెండి వస్తువులు, ఇతర వస్తువులు, పత్రాల విలువను మదింపు చేస్తున్నట్లు వారు చెప్పారు. ముడి సరకులు రవాణా చేసే శ్రేయస్ కాశ్యప్ అనే ప్రైవేట్ సంస్థ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసులు ప్రశాంత్‌ను లంచం పుచ్చుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News