Sunday, December 22, 2024

ముడా కేసులో అవసరమైతే సిఎంకు మళ్లీ లోకాయుక్త సమన్లు

- Advertisement -
- Advertisement -

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి లోకాయుక్త చేపట్టిన దర్యాప్తులో అవసరమైతే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మళ్లీ సమన్లు రావచ్చని ముఖ్యమంత్రి న్యాయసలహా దారు ఎఎస్. పొన్నన్న గురువారం వెల్లడించారు. లోకాయుక్త సమన్లు జారీ చేయగా బుధవారం ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మైసూరు లోని లోకాయుక్త పోలీస్‌ల ముందు విచారణకు హాజరయ్యారు. లోకాయుక్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) టిజె యుజేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. “ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, ఇంకా ఏమైనా ప్రశ్నలు అడగాలని ఉంటే మరింత సమాచారం కావాలనుకుంటే తన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోడానికి మళ్లీ పిలవవచ్చని సిఎం చెప్పారు.

” అని సీనియర్ అడ్వకేట్ , కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ చెప్పారు. “ పాత క్రిమినల్ ప్రొసీజర్(సిఆర్‌పిసి)41 ఎ ప్రకారం లోకాయుక్త నోటీస్ జారీ చేశారని, సిఎం హాజరును రికార్డు చేశారని, ఇంకా అవసరం అనుకుంటే మళ్లీ పిలుస్తారని పొన్నన్న తెలిపారు. ఇది దర్యాప్తులో సాధారణ ప్రక్రియ . ఈ సందర్భంగా దర్యాప్తు అధికారి నిందితులను ఎన్నిసార్లు విచారించాలనుకుంటే అన్ని సార్లు పిలుస్తారు అని పొన్నన్న వివరించారు. లోకాయుక్త పోలీస్‌లు ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను నిందితుడు నెం.1 గా చేర్చారు. అక్టోబర్ 25న నిందితురాలు 2 గా నమోదైన సిఎం భార్య పార్వతిని విచారించేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News