Friday, September 27, 2024

సిద్దరామయ్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు

- Advertisement -
- Advertisement -

కోర్టు ఉత్తర్వుల మేరకు మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) భూ కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసు దర్యాప్తునకు ఆదేశిస్తూ బెంఠూరులోని ప్రత్యేక కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సిద్దరామయ్య భార్య పార్వతికి 14 స్థలాలను ముడా కేటాయించడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిద్దరామయ్యపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ గావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి

ఇవ్వడాన్ని కర్నాటక హైకోర్టు సమర్థించిన మరుసటి రోజే ఎంపి, ఎమ్మెల్యేలపై నమోదయ్యే క్రిమినల్ కేసులను మాత్రమే విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దర్యాప్తు చేపట్టవలసిందిగా లోకాయుక్త పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. సిద్దరామయ్య భార్య పార్వతితోపాటు ఆయన బావమరిది మల్లికార్జునస్వామి, దేవరాజు(తన సోదరి పార్వతికి కానుకగా ఇచ్చిన భూమిని మల్లికార్జున స్వామికి విక్రయించిన వ్యక్తి), తదితరుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News