Tuesday, January 28, 2025

ముడా కేసు.. సీఎం సిద్ధరామయ్యను లోకాయుక్త నోటీసులు

- Advertisement -
- Advertisement -

ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నవంబర్ 6న విచారణకు పిలిచినట్లు అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. దీనిపై లోకాయుక్త సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఉదయం హాజరు కావాల్సిందిగా సీఎం సిద్ధరామయ్యను కోరామని తెలిపారు.

లోకాయుక్త పోలీసుల సమన్లపై సిద్ధరామయ్య స్పందించారు. ‘అవును.. ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త నోటీసు జారీ చేసింది. విచారణ ఎదుర్కొనేందుకు రేపు మైసూర్ లోకాయుక్తకు వెళతాను’ అని అన్నారు. కాగా, మరికొందరి పేర్లను లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News