Tuesday, April 1, 2025

జగన్ రద్దుల ముఖ్యమంత్రి: లోకేష్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: టిడిపి తెచ్చిన పథకాల్లో కొన్నింటిని వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని టిడిని నేత లోకేష్ మండిపడ్డారు. అన్నమయ్య జిల్లాలో టిడిపి నేత లోకేష్‌ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపి హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.365 కోట్ల నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. మరికొన్నింటిని కొత్త పథకాల్లో కలిపేసిందని బ్రాహ్మణ సేవా సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పేద బ్రాహ్మణులకు అండగా ఉండేందుకు గతంలో టిడిపి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. పథకాలను రద్దు చేస్తూ జగన్ రద్దుల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని చురకలంటించారు. టిడిపి అధికారంలోకి రాగానే బ్రాహ్మణులను అదుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News