Monday, December 23, 2024

దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు గాయం

- Advertisement -
- Advertisement -

పాలక్కాడ్(కేరళ): దళపతి విజయ్ నటించిన లియో చిత్రం ప్రచారం కోసం మంగళవారం పాలక్కాడ్‌లోని ఒక థియేటర్‌కు వచ్చిన చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు అభిమానుల అత్యుత్సాహం కారణంగా స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కాలికి స్వల్పంగా గాయమైంది.

మంగళవారం మధ్యాహ్నం అరుణ థియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. లోకేష్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమపడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అభిమానుల తాకిడిలో లోకేష్ కాలికి స్వల్పంగా గాయమైంది. దీంతో..త్రిసూర్‌లోని రాగం థియేటర్, కోచ్చిలోని కవితా థియేటర్‌లో అభిమానులను కలుసుకోవాలనుకున్న లోకేష్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలక్కాడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లను సంప్రదించిన లోకేష్ అక్కడ నుంచి నేరుగా కోయంబత్తూరు వెళ్లిపోయారు. కోయంబత్తూరులోనే ఉంటారా లేక చెన్నై వెళ్లిపోతారా అన్నది ఇంకా తెలియరాలేదని లోకేష్ సన్నిహితులు లెఇపారు.

ఇదిలా ఉండగా పాలక్కాడ్‌లో తనకు జరిగిన గాయంపై ఎక్స్ వేదికగా లోకేష్ కనకరాజ్ స్పందించారు. కేరళ ప్రజలు తన పట్ల చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల తాకిడిలో తనకు స్వల్ప గాయమైందని, దీని కారణంగా మరో రెండు చోట్ల థియేటర్ల సందర్శనను రద్దు చేసుకోవలసి వచ్చిందని ఆయన తెలిపారు. త్వరలోనే కేరళను మరోసారి సందర్శిస్తానని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News