Wednesday, January 22, 2025

జగన్ ని  నిలదీసిన లోకేశ్

- Advertisement -
- Advertisement -

కుప్పం: ఏలూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో నిర్మిస్తున్న వైసిపి కార్యాలయాల ఫోటోలను ‘ఎక్స్’ ఖాతాలో పెడుతూ…‘‘ ఆంధ్రప్రదేశ్ నీ తాత రాజా రెడ్డి జాగీరా?’’ అని మాజీ సిఎం జగన్ ని నిలదీశారు టిడిపి నాయకుడు లోకేశ్.

వైసిపి కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకుపైగా భూములను రూ. 1000 నామ మాత్రపు ఫీజుతో లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నారని విమర్శించారు. జనం నుంచి దోచుకున్న రూ. 500 కోట్లతో రాజభవనాలు కట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 500 కోట్లతో 25000 మంది పేదలకు ఇళ్లు కట్టించొచ్చన్నారు. ‘‘నీ ధన దాహానికి అంతే లేదా?’’ అంటూ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News