అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారణకు టిడిపి నేత లోకేష్ హాజరయ్యారు. ఐదు నిమిషాల ముందే సిఐడి కార్యాలయానికి లోకేష్ చేరుకున్నారు. తాడేపల్లి సమీపంలోని సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డులో అక్రమాలు జరిగాయని సిఐడి నోటీసులు ఇచ్చింది. నోటీసుల్లోని పలు అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును లోకేష్ ఆశ్రయించారు. హైకోర్టు సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది. విచారణ సమయంలో లోకేష్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని సిఐడికి కోర్టు ఆదేశించింది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Also Read: ఎన్నిక ఏకపక్షమే.. హ్యాట్రిక్ సిఎం లాంఛనమే