Sunday, January 19, 2025

ఎన్ని అవమానాలైనా భరిద్దాం: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని టిడిపి నేత లోకేష్ తెలిపారు. శాసన సభలో టిడిపి సభ్యులు అనుచరించాల్సి విధానాలపై లోకేష్ సూచనలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్ట సభలను వదులుకోకూడదని హెచ్చరించారు. సభలో చేయాల్సిన పోరాటం సభలో చేద్దామని, వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని, సభలో మైక్ ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని లోకేష్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News