Monday, December 23, 2024

సిఐడి విచారణకు హాజరైన లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేష్..

- Advertisement -
- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో సిఐడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  సన్నిహితుడు కిలారు రాజేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో సిఐడి అధికారులు అతడిని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కిలారు రాజేష్ అభియోగాలు ఎదుర్కొంటు న్నారు. నారా లోకేశ్ కు కిలారు రాజేష్ ద్వారానే నగదు చేరిందని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు ఈ కేసులో కిలారు రాజేష్‌ను సిఐడి అధికారులు నిందితులుగా చేర్చలేదు. అయితే సిఐడి అధికారులు విచారణకు హాజరుకావాలని 41ఎ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కిలారు రాజేష్ సోమవారం సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అరెస్ట్ తర్వాత కిలారు రాజేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు కిలారు రాజేష్ పేరును నిందితుడిగా చేర్చలేదని సిఐడి అధికారులు పేర్కొన్నారు. అతడిని ఈ కేసులో చేరిస్తే సిఆర్‌పిసి 41ఎ కింద నోటీసులు జారీ చేసి విచారిస్తామని చెప్పారు. ఈ క్రమమంలోనే కిలారు రాజేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసివేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News