Monday, December 23, 2024

రెండు గూడ్స్ రైళ్లు ఢీ: లోకో పైలట్ మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఆగి ఉన్న గూడ్స్ రైలు మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో పైలట్ మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం శహ్‌డోల్ జిల్లాలో జరిగింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… బిలాస్‌పూర్-కట్నీ మార్గంలో సింగపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు వెళ్తోంది. అదే ట్రాక్‌పై మరో గూడ్స్ రైలు ఆగి ఉండడంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకో పైలట్ రాజేశ్ ప్రసాద్ గుప్తా ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.

Also Read: కట్నం కోసం బ్లాక్‌మెయిల్: భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News